యూఎస్ ఓపెన్.. జకోవిచ్ అవుట్.. కారణం కోపం.. కోపంతో కొట్టిన బంతి..?
Novak Djokovic
కాగా.. కోపంతో జకోవిచ్ వెనక్కి విసిరిన ఓ బంతి అక్కడే ఉన్న లైన్ అంపైర్‌కు బలంగా తగలడంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలారు. గొంతు సమీపంలో తగలడంతో ఆమె చాలా ఇబ్బంది పడ్డారు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన టోర్నీ రెఫరీ సోరెన్ ఫ్రీమెల్, గ్రాండ్ స్లామ్ సూపర్‌వైజర్ ఆండ్రియాస్ ఎగ్లీ.. జకోవిచ్‌తో 10 నిమిషాల పాటు మంతనాలు జరిపారు.
ఆ సమయంలో జకోవిచ్ వారిని ప్రాధేపడినట్లు దృశ్యాల్లో కనిపించింది. కొద్దిసేపటి తర్వాత జకోవిచ్ మ్యాచ్ నుంచి నిష్క్రమిస్తున్నట్లు ఫ్రీమెల్ ప్రకటించాడు. దీనిపై స్పందించిన యూఎస్ టెన్నిస్ అసోసియేషన్.. నిబంధనల ప్రకారమే ఫ్రీమెల్ జకోవిచ్‌ను టోర్నీ నుంచి బహిష్కరించారని ప్రకటించింది.
