గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. పర్యాటక రంగం
  3. సముద్ర తీరాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 సెప్టెంబరు 2020 (18:17 IST)

కరోనా పాజిటివ్ రోగులకే అక్కడ ప్రవేశం... ఎందుకని?

కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తోంది. ఈ వైరస్ దెబ్బకు ప్రపంచ ప్రజలంతా చావు భయంతో వణికిపోతున్నారు. ఈ వైరస్ వ్యాపించకుండా, తమ తమ దేశాల్లోకి ప్రవేశించకుండా ఉండేందుకు ఏకంగా దేశ సరిహద్దులనే మూసివేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఫలితంగా ప్రపంచ ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలన్నీ బోసిబోయి కనిపించాయి. 
 
అయితే, ఇపుడు పరిస్థితులు క్రమంగా మెరుగుపడుతున్నాయి. దీంతో పర్యాటక ప్రాంతాలు ఒక్కొక్కటిగా తెరుచుకుంటున్నాయి. అలాంటి వాటిలో బ్రెజిల్‌లోని పెర్నంబుకో స్టేట్‌లో ఫెర్నాండో డి నొరాన్హా అనే దీవుల సమూహం కూడా ఉంది. కరోనా మహమ్మారికి ముందు ఈ దీవులకు లక్షల సంఖ్యలో పర్యాటకులు వచ్చివెళ్లేవారు. పైగా, ప్రపంచ అత్యుత్తమ సముద్ర తీరం అవార్డును సైతం ఈ ద్వీప సమూహానికే దక్కింది. 
 
అలాంటి దీవులు కూడా కరోనా భయంతో వణికిపోతాయి. కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ దీవులకు పర్యాటకులను అనుమతించాలని ఆ దేశ అధికారులు నిర్ణయించారు. అయితే, ఓ షరతు విధించింది. ఆ షరతు ఏంటంటే.. కరోనా వైరస్ సోకి, ఆ వైరస్ నుంచి కోలుకున్న వారికే ఈ దీవుల్లోకి ప్రవేశం కల్పించనున్నారు. 
 
అంటే, కరోనా పాజిటివ్ ఉన్నవాళ్లకే తమ దీవిలో ప్రవేశం ఉంటుందని ఓ నిబంధన విధించారు. కరోనా పాజిటివ్ వచ్చిందని మెడికల్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుంది. అదికూడా పీసీఆర్ టెస్టులో వచ్చిన ఫలితాన్నే పరిగణనలోకి తీసుకుంటారు. అంతేకాదు, 20 రోజుల లోపు పరీక్ష చేయించుకుని ఉండాలట. ఇంతజేసీ, కరోనా పాజిటివ్ వ్యక్తులనే దీవులకు ఎందుకు ఆహ్వానిస్తున్నారో అధికారులు వెల్లడించలేదు.