సంబంధిత వార్తలు
- అమిత్ షా 'టి'లో కాలుపెట్టారు... డబ్బులిస్తున్నా కేసీఆర్ టాయిలెట్స్ కట్టించడంలేదు...
- క్షమాపణ చెప్పను.. ఏం చేసుకుంటారో చేస్కోండి: డిగ్గీ రాజా సవాల్
- 'శాతకర్ణి'తో తెలంగాణ ప్రభుత్వం రూ.2 కోట్లతో తవ్వకాలు చేస్తోంది... బాలయ్య ఇంటర్వ్యూ
- కేసీఆర్కు ఎన్ని మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోవడంలేదు.. లండన్ ఎన్నారై
- పెద్ద నోట్ల రద్దుతో తెలంగాణ సర్కారు ఖజానా ఖాళీ? ఉద్యోగులకు సగం జీతమే?!!
'కేసీఆర్ పంపిండు ఉయ్యాలో.. 50 రూపాయల చీర ఉయ్యాలో' (Video)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపే పండుగల్లో బంతుకమ్మ పండుగ ఒకటి. ఈ పండుగను సంక్రాంతి పండుగలా జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోం
"కేసీఆర్ పంపిండు ఉయ్యాలో..
50రూపాయల చీర ఉయ్యాలో..
ని బిడ్డ కడుతాద ఉయ్యాలో..
ని కోడలు కడుతాద ఉయ్యాలో..
మాకొద్దు ఈ చీర ఉయ్యాలో..
50రూపాయల చీర ఉయ్యాలో..
నిన్నెవడు పంపమండు ఉయ్యాలో
50 రూపాయల చీర ఉయ్యాలో....
మల్ల నీకు ఓటెయ్య ఉయ్యాలో
కేసీఆర్ సార్ ఉయ్యాలో...."
ఈ పాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నోట మార్మోగిపోతోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరిపే పండుగల్లో బంతుకమ్మ పండుగ ఒకటి. ఈ పండుగను సంక్రాంతి పండుగలా జరుపుకుంటారు. ఈ పండుగను పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోంది.
ఈ చీరలపై తెలంగాణ మహిళలు భగ్గున మండిపడుతున్నారు. గద్వాల చీరల పంపిణీ అని టీవీ ఛానెళ్లలో ప్రకటించి, తీరా పంపిణీ వరకు వచ్చేసరికి తమకు రూ.100 చీరలు అంటగడుతున్నారని మండిపడ్డారు. ఈ 100 రూపాయల చీరల కోసం 300 రూపాయల కూలీ పనులు మానుకుని వచ్చామని ఆగ్రహం వ్యక్తంచేశారు.
బతుకమ్మ ఉత్సవాల్లో ఈ చీరెలు కట్టుకుని కేసీఆర్ కుమార్తె ఎంపీ కవిత బతుకమ్మ ఆడతదా? అని పలువురు మహిళలు ప్రశ్నించారు. పేద మహిళలంటే అంత చులకనా? కేసీఆర్ సారూ అని వారు నిలదీశారు. రూ.50-రూ.60కు వచ్చే చీరెలను ఎవరైనా పండుగపూట కట్టుకుంటరా? అని వారు మండిపడ్డారు. అనంతరం ప్రభుత్వం పంపిణీ చేసిన చీరలను రోడ్డుపై వేసి తగులబెట్టి, తమ నిరసన తెలిపారు.
అంతేనా చీరలన్నీ కుప్పగా వేసి దాని చుట్టూత కొంతమంది మహిళలు చేరి బంతుకమ్మ పాటను పాడుతున్నారు. "కేసీఆర్ పంపిండు ఉయ్యాలో.. 50 రూపాయల చీర ఉయ్యాలో" అంటూ వారు పాడుతున్న పాట ఇపుడు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది. ఆ వీడియోనూ మీరూ ఓ సారి చూడండి.