మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ivr
Last Modified: సోమవారం, 22 మే 2017 (21:49 IST)

అమిత్ షా 'టి'లో కాలుపెట్టారు... డబ్బులిస్తున్నా కేసీఆర్ టాయిలెట్స్ కట్టించడంలేదు...

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గ్రామీణ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ప్రారంభించారు. ఇక్కడ కూడా అదే సెంటిమెంటును బయటకు తీశారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు

భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అడుగుపెట్టినప్పుడు అక్కడ గ్రామీణ ప్రజలతో సహపంక్తి భోజనం చేసి పర్యటన ప్రారంభించారు. ఇక్కడ కూడా అదే సెంటిమెంటును బయటకు తీశారు. నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గం చండూరు మండలం తెరట్‌పల్లి గ్రామంలో పర్యటన సందర్భంగా కేసీఆర్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కేంద్రం నిధులు ఇస్తున్నా వాటిని ప్రభుత్వం ఖర్చు చేయడంలేదనీ, కేంద్ర పథకాలు కిందస్థాయికి చేరడం లేదనటానికి మరుగుదొడ్లు లేకపోవడమే నిదర్శనమన్నారు. 
 
ప్రధాని మోదీ అందరి అభివృద్ధి కోసం పని చేస్తున్నారనీ, ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీగా అవతరించిన భాజపా తెలంగాణలో కూడా అధికారంలోకి వస్తుందన్న నమ్మకం ఉందని అన్నారు. కార్యకర్తలతో సమావేశం ముగిసిన తర్వాత వారితో కలిసి సహపంక్తి భోజనం చేశారు.