మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఎన్.ఆర్.ఐ.
  3. ప్రత్యేక వార్తలు
Written By ivr
Last Modified: శనివారం, 7 జనవరి 2017 (23:43 IST)

కేసీఆర్‌కు ఎన్ని మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోవడంలేదు.. లండన్ ఎన్నారై

లండన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నారై సెల్ యూకె శాఖా ఆధ్వర్యంలో ఇండియా హౌస్‌లో లండన్‌ హైకమిషనర్ శ్రీ సింహ ద్వారా ప్రధాని మోదీకి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట్ట, ప్రజాస్వామ్య, రైతు వ్యతిరేక విధానాలపై సమగ్ర రిపోర్

లండన్‌లో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నారై సెల్ యూకె శాఖా ఆధ్వర్యంలో ఇండియా హౌస్‌లో లండన్‌ హైకమిషనర్ శ్రీ సింహ ద్వారా ప్రధాని మోదీకి మల్లన్న సాగర్ ప్రాజెక్టు పైన రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న చట్ట, ప్రజాస్వామ్య, రైతు వ్యతిరేక విధానాలపై సమగ్ర రిపోర్టును మెమొరాండం సమర్పించారు. అనంతరం భారత మొదటి ప్రధాని శ్రీ నెహ్రు విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేబట్టారు. ఈ కార్యక్రమంలో UK కన్వీనర్ గంప వేణుగోపాల్, సలహాదారులు ప్రవీణ్ రెడ్డి గంగసాని, కొ-కన్వీనర్లు  చిట్టెం అచ్యుత్ రెడ్డి, కొత్త రామ్ మోహన్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ మెంబెర్ మంగళారపు శ్రీధర్ బాబు బృందం ఆధ్వర్యంలో జరిగింది.
 
ఎన్నారై సెల్ కన్వీనర్ గంప వేణుగోపల్ మాట్లాడుతూ డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ (DPR ) లేకుండా భూమి సేకరించడం చట్ట విరుద్ధం అని, 2013లో పార్లమెంట్ భూమి సేకరణ చట్టం ఉండగా కెసిఆర్ ప్రభుత్వం జిఓ అంటూ తీసుకురావడం పార్లమెంటును అవమానపరిచినట్లేనని, రైతులపై 144 సెక్షన్ పెట్టి, గ్రామాల్లో పోలీసు పహారా మోహరించి ప్రజలను ఆందోళన గురిచేయడం నాటి రజాకర్లను గుర్తు చేస్తున్నారాని తెలిపారు. ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ, కెసిఆర్ చట్ట వ్యతిరేక విధానాలు అవలంబించడం అలవాటుగా మారిందని ఎన్నిసార్లు కోర్టులు తిడుతున్నా, మొట్టికాయలు వేసినా పద్ధతి మార్చుకోవడం లేదని అన్నారు. 
 
అచ్యుత రెడ్డి మాట్లాడుతూ, 123 కోర్ట్ కొట్టివేసిన కొత్త చట్టాలు తెచ్చి మా పని చేసుకుంటాం అని చెప్పడం నిరంకుశత్వానికి అద్దం పడుతుందని తెలిపారు. రామ్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రధాని జోక్యం చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం చేబడుతున్న రైతు వ్యతిరేక విధానాలను అడ్డుకోవాలని అన్నారు. శ్రీధర్ బాబు మాట్లాడుతూ, రైతు ఆగ్రహానికి గురికాక తప్పదని, బ్రతుకు తెలంగాణ ముందు, బంగారు తెలంగాణ తర్వాత సంగతి అన్నారు.