తన యజమానిని కరిచేందుకు ప్రయత్నించిన పామును కుక్క నోట కరిచింది. యజమాని ప్రాణాలను రక్షించి.. పాము కాటేయడంతో కుక్క మరణించిన అరుదైన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లా కల్లూరు మండల కేంద్రంలో కిషోర్ ఆర్ఎంపీగా పనిచేస్తున్నాడు. శనివారం మధ్యాహ్నా సమయంలో వెనుక గదిలో నిద్రిస్తున్నాడు. ఆ సమయంలో గదిలోకి తాచుపాము వెనుక పైపు నుంచి ఇంట్లోకి ప్రవేశించింది. దీన్ని గమనించిన స్నూపీ(కుక్క) పరుగున ఇంట్లోకి వెళ్లి తాచుపాముపై...