బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 13 ఏప్రియల్ 2020 (09:27 IST)

పాక్ కాల్పుల్లో ముగ్గురు కాశ్మీరీలు బలి

కరోనా కల్లోలంతో ప్రపంచమంతా అల్లాడిపోతుంటే పాకిస్థాన్ మాత్రం తన నీచబుద్ధిని విడవడం లేదు. మ‌రోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.

జ‌మ్ముక‌శ్మీర్ స‌రిహ‌ద్దుల్లో కెరాన్ సెక్టార్లో గ్రెనేడ్‌లు, రాకెట్ లాంచ‌ర్ల‌తో దాడికి పాల్ప‌డింది. ఆదివారం సాయంత్రం 5 గంట‌ల‌కు భారత పౌరుల ఆవాస ప్రాంతాలే ల‌క్ష్యంగా జ‌రిగిన ఈ దాడుల్లో ఒక మైన‌ర్ స‌హా ముగ్గురు మృతిచెందారు.

గ‌త వారం కూడా కొంత‌మంది పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్ర‌వాదులు కెరాన్ సెక్టార్ ద్వారా భార‌త్‌లోకి ప్ర‌వేశించే ప్ర‌యత్నం చేశారు. అయితే వారి కుట్రను భార‌త సైన్యం భ‌గ్నం చేసింది.

చొర‌బాటుకు ప్ర‌య‌త్నించిన ఏడుగురు ఉగ్ర‌వాదుల‌ను మ‌ట్టుబెట్టింది. ఈ సంద‌ర్భంగా ఉగ్ర‌వాదుల‌తో జ‌రిగిన భీక‌ర పోరులో ఐదుగురు భార‌త ఆర్మీ క‌మాండ‌ర్లు వీరమ‌ర‌ణం పొందిన విషయం తెలిసిందే.