మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : శుక్రవారం, 6 మార్చి 2020 (13:39 IST)

వామ్మో.. ఒకే ఇంట్లో 66 పాము పిల్లలు

కర్నూలు జిల్లా అమకతాడు గ్రామంలోని ఓ ఇంట్లో పాములు కలకలం​ రేపాయి. ఇంటి మెట్ల కింద ఏకంగా 66 పాము పిల్లలు, 80కి పైగా పాము గుడ్లు ఉండటంతో ఆ ఇంట్లో వాళ్లు కంగారుపడ్డారు.

వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన తలారి శేషన్న కుటుంబ సభ్యులు ప్రతిరోజు మెట్లపై కూర్చుని మాట్లాడుకునేవారు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం ఒక పాము పిల్ల ఇంటి ముందు కనిపించింది.

బయటి నుంచి వచ్చిందనుకుని దాన్ని చంపేశారు. మెట్ల కింద రంధ్రం కనిపించడంతో అనుమానంతో దానిలోకి పొగ పెట్టారు. దీంతో ఒక్కొక్కటిగా పాము పిల్లలు బయటకు వచ్చాయి.

చివరకు మెట్లను పూర్తిగా పెకిలించి చూడగా... అందులో 66 నాగుపాము, జర్రిపోతు పిల్లలు, 80 దాకా పాము గుడ్లు కనిపించాయి. గ్రామస్తులు పాము పిల్లలను చంపేసి, గుడ్లను ధ్వంసం చేశారు.