1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. Today and Tomarrow heavy rains in Telangana

తెలంగాణాలో రెండు రోజుల పాటు వర్షాలు

Telangana
తెలంగాణా రాష్ట్రంలో రెండు రోజులపాటు వర్షాలు విస్తారంగా పడనున్నాయి. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో నేడు, రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
మరీ ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన ఉన్నట్టు తెలిపింది. తెలంగాణలోనూ శని, ఆదివారాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది.
 
కాగా, నిన్న తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షాలు కురిశాయి. వనపర్తి జిల్లాలోని శ్రీరంగాపూర్‌లో 2.5, పెబ్బేరులో 1.8, గద్వాలలో 1.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. పశ్చిమ భారతదేశం నుంచి తెలంగాణవైపు తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్టు వాతావరణ కేంద్రం తెలిపింది.
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
తెలంగాణాలో మరో నాలుగు డిగ్రీ కాలేజీలకు గ్రీన్ సిగ్నల్