గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (12:11 IST)

దళిత బంధుపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలోని తెరాస ప్రభుత్వం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై ఆది నుంచి విమర్శలు వస్తున్నాయి. హుజురాబాద్‌కు జరుగనున్న అసెంబ్లీ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ పథకాన్ని తెరపైకి తెచ్చారంటూ విపక్ష నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో దళితబంధు పథకం కోసం హుజూరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్‌ను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేయడాన్ని సవాల్ చేస్తూ  తెలంగాణ హైకోర్టులో శుక్రవారం నాడు పిల్ దాఖలైంది. జనవాహిని, జైస్వరాజ్, తెలంగాణ రిపబ్లిక్ పార్టీలు పిటిషన్లు దాఖలు చేశాయి.
 
దళితబంధు పథకంపై తెలంగాణ హైకోర్టులో శుక్రవారం పిల్ దాఖలైంది. ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే హుజూరాబాద్‌లో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేస్తున్నారని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ తరుణంలో హైకోర్టులో పిల్ దాఖలైంది.
 
కాంగ్రెస్, తెరాస, బీజేపీలతో పాటు ఈసీ, తెలంగాణ ప్రభుత్వాన్ని  ప్రతివాదులుగా చేశారు పిటిషనర్లు. రైతు బంధు పథకం తరహలోనే దళిత బంధు పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ పథకాన్ని  హుజూరాబాద్‌లో పైలెట్ ప్రాజెక్టుగా చేపట్టడం సరికాదని పిల్ దాఖలు చేశారు.