1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (09:50 IST)

దేశంలో 40 వేలకు తగ్గని కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి ఏమాత్రం తగ్గుముఖం పట్టడం లేదు. ముఖ్యంగా రోజు వారీ కేసుల నమోదులో 40 వేలకు తగ్గడం లేదు. తాజాగా గత 24 గంటల్లో కొత్తగా 41,649 కొవిడ్‌ కేసులు రికార్డయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది. 
 
మరో 37,291 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మహమ్మారి బారినపడి మరో 593 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం దేశంలో 4,08,920 యాక్టివ్‌ కేసులున్నాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,16,13,993కు పెరిగింది.
 
ఇందులో 3,07,81,263 మంది కోలుకున్నారు. వైరస్‌ బారినపడి 4,23,810 మంది మృతి చెందారు. టీకా డ్రైవ్‌లో భాగంగా 46,15,18,479 డోసులు పంపిణీ చేసినట్లు ఆరోగ్యశాఖ వివరించింది. 
 
మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 1.29శాతం ఉన్నాయని, ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 2.42శాతం ఉందని పేర్కొంది. రోజువారీ పాజిటివిటీ రేటు 2.34శాతం ఉందని చెప్పింది. ఇప్పటి వరకు దేశంలో 46.64 కోట్ల కొవిడ్‌ శాంపిల్స్‌ పరీక్షించినట్లు వివరించింది.