సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

31-07-2021 శనివారం దినఫలాలు - సుబ్రమణ్య స్వామిని పూజించినా...

మేషం : వ్యాపారాల్లో స్వల్ప ఒడిదుడుకులు, చికాకులు ఎదుర్కొంటారు. మీ వాహనం ఇతరులకిచ్చే విషయంలో లౌక్యంగా వ్యవహరించండి. ఉద్యోగస్తులు అధికారులను మెప్పించడానికి బాగా శ్రమించాల్సి ఉంటుంది. శారీరక శ్రమ, మానసికాందోళన వల్ల స్వల్ప అస్వస్థతకు గురవుతారు. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆకర్షితలవుతారు. 
 
వృషభం : బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలోను, అపరిచిత వ్యక్తులతో మెళకువ అవసరం. ప్రముఖులను కలుసుకుంటారు. రావలసిన ధనం కొంత ముందూవెనుకలుగానైనా అందడం వల్ల ఆర్థిక ఇబ్బంది అంటూ ఏదీ ఉండదు. 
 
మిథునం : దైవ సేవా, కార్యక్రమాల్లో మంచి పేరు ఖ్యాతి గడిస్తారు. ఉపాధ్యాయులకు చికాకులు తలెత్తుతాయి. రాజకీయ నాయకులు సభలు, సమావేశాల కోసం ధనం ఖర్చు చేస్తారు. ఉద్యోగస్తుల పై అధికారులతో సంభాషించేటపుడు మెళకువ అవసరం. మీ సంతానం ఆరోగ్యం, విద్యా విషయాల గురించి ఆలోచిస్తారు. 
 
కర్కాటకం : ప్రింటింగ్ రంగాల్లో వారికి అచ్చు తప్పులు పడుట వల్ల మాటపడతారు. కుటుంబీకులతో కలిసి పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. భార్యాభర్తల మధ్య సఖ్యత నెలకొంటుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అభివృద్ధి దిశగా మీ ఆలోచన ఉంటాయి. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం. 
 
సింహం : ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినప్పటికిని మిత్రుల సహకారం వల్ల నెమ్మదిగా కుదుటపడతారు. ఐరన్ రంగం వారికి ఆటంకాలు తప్పవు. బ్యాంకింగ్ రంగాలలో వారికి ఒత్తిడి, చికాకులు తప్పవు. పారిశ్రామిక రంగంలని వారు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఖర్చులు తగ్గించుకోవాలనే మీ యత్నం అనుకూలిస్తుంది. 
 
కన్య : ప్రైవేటు సంస్థలలోని వారు చేతులలో పని ఉండి, వేరే దానికోసం ప్రయత్నించడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. మీ యత్నాలు కొంత ఆలస్యంగానైనా పరిపూర్ణంగా పూర్తవుతాయి. రావలసిన బకాయిలు ఆలస్యం కావడం వల్ల చికాకులకు లోనవుతారు. నూతన టెండర్ల విషయంలో పునరాలోచన అవసరం. 
 
తుల : వాతావరణంలోని మార్పు వ్యవసాయ తోటల రంగాలలోని వారికి ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలలో మిత్రుల సలహా పాటిస్తారు. వ్యాపారాభివృద్ధికి చేయు కృషిలో గుర్తింపు లభిస్తుంది. కోర్టు వ్యవహారాలలో ఫ్లీడర్ల తీరు ఆందోళన కలిగిస్తుంది. స్త్రీలకు యోగా, అలంకారాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
వృశ్చికం : దైవ, పుణ్యకార్యాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. రాజకీయాలలోని వారికి ఒత్తిడి, ఆందోళన అధికం కాగలవు. గృహోపకరణాలకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. చిన్నతరహా పరిశ్రమలలో వారికి విద్యుత్ లోపం వల్ల ఒత్తిడికి లోనవుతారు. మిమ్మలను పొగిడే వ్యక్తులను ఓ కంట కనిపెట్టండి. 
 
ధనస్సు : దేవాలయ విద్యా సంస్థలకు దాన ధర్మాలు చేయడం వల్ల మంచి పేరు, ఖ్యాతి లభిస్తుంది. మీ కళత్ర ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. పోస్టల్, కొరియర్ రంగాల వారికి ఒత్తిడి, తిప్పట తప్పదు. విద్యార్థులకు టెక్నికల్, మెడికల్, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో అవకాశాలు లభిస్తాయి. 
 
మకరం : ఆర్థిక వ్యవహారాల్లో ఆశించిన ప్రయోజనాలు సాధించడం కష్టం గొప్ప గొప్ప ఆలోచనలు, ఆశయాలు స్ఫురిస్తాయి. కోర్టు వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. ప్రముఖులను కలుసుకుంటారు. నిరుద్యోగులకు ఉపాధి పథకాలకు మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రయాణాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు చేస్తారు. 
 
కుంభం : పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలలో మెళకువ వహించండి. దూర ప్రయాణాలకై చేయు ప్రయత్నాలలో ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబంలోని పెద్దల వైఖరి ఆనందం కలిగిస్తుంది. విద్యార్థులు బజారు తినుబండారాలు భుజించడం వల్ల అస్వస్థతకు లోనవుతారు.
 
మీనం : చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలలో ఖర్చులు అంచనాలను మించుతాయి. దూర ప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళకువ అవసరం. వ్యాపారాల్లో మార్పులు చేర్పులకు ప్రయత్నిస్తారు. సిమెంట్, ఐరన్, కలప, ఇటుక వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగ ప్రయత్నాలకు విఘాతం కలిగే అవకాశం ఉంది.