సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 30 జులై 2021 (11:15 IST)

దేశంలో మళ్లీ కరోనా ప్రభంజనం ... పెరుగుతున్న కేసులు

దేశంలో కరోనా వైరస్ మళ్లీ ప్రభంజనం సృష్టించేలా కనిపిస్తుంది. రోజువారీగా నమోదయ్యే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 44,230 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయ‌ని కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్ర‌క‌టించింది. 
 
అలాగే, 24 గంట‌ల్లో 42,360 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,15,72,344కు చేరింది. అదేవిధంగా ఈ వైరస్ బారినపడి చనిపోయిన బాధితుల సంఖ్యను పరిశీలిస్తే, గురువారం 555 మంది క‌రోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య మొత్తం 4,23,217కు పెరిగింది. 
 
మరోవైపు, దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 3,07,43,972 మంది కోలుకున్నారు. 4,05,155 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 45,60,33,754 వ్యాక్సిన్ డోసులు వేశారు.