శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 28 జులై 2021 (10:39 IST)

దేశంలో ఒక్కసారిగా పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు

దేశంలో మరోమారు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుంది. కొత్తగా 43,654 మందికి వైరస్ నిర్ధరణ అయింది. అలాగే, ఈ వైరస్ సోకి మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. 
 
దేశంలో కరోనా కేసులు మంగళవారంతో పోలిస్తే భారీగా పెరిగాయి. కొత్తగా 43,654 మందికి వైరస్ సోకినట్లు తేలింది. మరో 640 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 41,678 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు: 3,14,84,605 మొత్తం మరణాలు 4,22,022గా ఉన్నాయి. 
 
ఈ వైరస్ నుంచి కోలుకున్నవారు  కోలుకున్నవారి సంఖ్య 3,06,63,147గా ఉండగా, దేశ వ్యాప్తంగా యాక్టివ్​ కేసులు 3,99,436 ఉన్నారు. ఇప్పటివరకు పంపిణీ చేసిన డోసుల సంఖ్య 44,61,56,659కు చేరినట్లు కేంద్ర వైద్య శాఖ తెలిపింది. మంగళవారం కొత్తగా 40,02,358 డోసులు పంపిణీ చేశారు.