ఆదివారం, 24 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 31 జులై 2021 (11:53 IST)

తెలంగాణాలో డెల్టా వేరియట్ కలకలం : వైద్యుడి బంధువుకు సోకిన వైరస్

తెలంగాణ రాష్ట్రంలో డెల్టా వేరియంటే కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే డెల్టా ప్లస్ కేసులు వచ్చినవారిలో ఒకరు ఓ వైద్యుడి బంధువు కాగా, మరొకరు విదేశాల నుంచి వచ్చిన వారు ఉన్నట్లు సమాచారం. 
 
నిజానికి గత కొన్ని రోజులుగా ఈ డెల్టా వేరియంట్ కేసులను దేశ వ్యాప్తంగా గుర్తిస్తున్నారు. ఇప్పటికే, 70కి పైగా కేసులను గుర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. 
 
వాస్తవానికి రోజువారీగా నమోదయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువగానే వుంది. అయితే హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో కరోనా ఉద్ధృతి పెరగడం ఆందోళన కలిగిస్తోంది. గాంధీలో సివియారిటీ కేసులు పెరుగుతున్నట్లు గాంధీ సూపరింటెండెంట్ రాజారావు తెలిపారు. 
 
నిజానికి వైరస్‌ పూర్తిగా పోలేదని, కేవలం కేసుల సంఖ్య మాత్రమే తగ్గిందన్నారు. ప్రజలు మాస్క్‌లు ధరించడం, శానిటైజర్లు వినియోగించడం మానేశారన్నారు. భౌతిక దూరం పాటించడం లేదన్నారు. 
 
మార్కెట్లు, హోటళ్లు, మాల్స్‌ జనంతో రద్దీగా మారుతున్నాయని చెప్పారు. దీంతో కేసుల పెరుగుతున్నాయని తెలిపారు. ప్రజలు జాగ్రత్తలు పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌వేవ్‌ ముప్పు తప్పదని ఆయన హెచ్చరించారు.