1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
  4. TSRTC Recruitment 2022 Apply for Telangana RTC Vacancies

తెలంగాణలో టీఆస్సార్టీసీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్

Jobs
తెలంగాణ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌. తెలంగాణ ఆర్టీసీ టీఆస్సార్టీసీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ పడింది. ఇంజినీరింగ్‌, నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో అప్రెంటీస్‌ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 
 
బీటెక్‌, బీఈ పట్టభద్రులు ఇంజినీరింగ్‌ విభాగానికి, బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి అక్టోబ‌రు 16వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. 
 
అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు.. దరఖాస్తుల సమర్పణకు ముందు https://portal.mhrdnats.gov.in/ వెబ్‌సైట్‌లో తమ వివరాలను నమోదు చేసుకోవాలి. 
 
ఆ తర్వాత అదే వెబ్‌సైట్‌లో టీఎస్‌ఆర్టీసీని ఎంపిక చేసుకుని STLHDS000005 యూజర్‌ ఐడీ ద్వారా అప్రెంటీస్‌ పోస్టులకు దరఖాస్తులు సమర్పించాలి. 
తర్వాతి కథనం
4 నగరాల్లో 5జీ బీటా నెట్‌వర్క్‌.. వారికి ఫ్రీనే..