సోమవారం, 20 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 అక్టోబరు 2023 (15:02 IST)

పవిత్ర లోకేష్ బాటలో ప్రగతి.. స్టార్ ప్రొడ్యూసర్‌తో రెండో పెళ్లి..?

Pragati
నిర్మాతతో రెండో పెళ్లికి రెడీ అయ్యింది సీనియర్ యాక్టర్ ప్రగతి. వయస్సు పైబడినా క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో హీరోయిన్లకు తల్లి, అత్త పాత్రలో కనిపిస్తూ.. మంచి గుర్తింపు సంపాదించిన ప్రగతి.. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్. 
 
నెటిజన్లు ఈమెను ప్రగతి ఆంటీ అంటూ పిలుచుకుంటారు. ఈ నేపథ్యంలో నిర్మాతతో ప్రగతి రెండో పెళ్లికి సిద్ధమైనట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్న ప్రగతి కొద్ది సంవత్సరాలకే భర్తతో కలిసి ఉండలేక ఆయనకు విడాకులు ఇచ్చేసి ఇండస్ట్రీలో రాణించింది. 
 
ఈ వయసులో తనకి తోడు అవసరం అని, రెండో పెళ్లి చేసుకోవాలి అని నిర్ణయించుకుందట. సదరు నిర్మాతే ప్రగతి వద్ద పెళ్లి ప్రపోజల్ తెచ్చినట్టు సమాచారం. ప్రగతి వయసు 47 ఏళ్లు. 21 ఏళ్ల వయసులోనే భర్తతో ఆమె విడిపోయింది. అప్పటి నుంచి ఆమె పెళ్లి చేసుకోలేదు.