బుధవారం, 11 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (20:26 IST)

సందీప్‌తో విడాకులా.. స్పందించిన మౌనికా రెడ్డి

Mounika reddy
Mounika reddy
సూర్య వెబ్ సిరీస్ షణ్ముఖ్ జశ్వంత్‌కు మంచి పేరు సంపాదించి పెట్టింది. ఈ వెబ్ సిరీస్‌తో మౌనికా రెడ్డి ఎంతో ఫేమస్ అయ్యింది. తర్వాత పవన్ కళ్యాణ్‌తో కలిసి భీమ్లా నాయక్ సినిమాల్లో కనిపించింది. ఆపై బాయ్‌ఫ్రెండ్ సందీప్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుని, పెళ్లి చేసుకుంది. 
 
అయితే పెళ్లై ఏడాది కాకుండా ఈ జంట విడిపోతుందంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై స్పందించింది మౌనికా రెడ్డి. మౌనికా ఇన్‌స్టాలో కూడా ఆమె పెళ్లి పిక్స్ లేకపోవడంతో.. ఒక్కసారిగా ఈ జంట కూడా విడిపోబోతుందంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తుంది.
 
దీనిపై మౌనికా స్పందిస్తూ... సందీప్, తాను ఉన్న పిక్‌ను ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేసింది. అందులో మళ్లీ మేం ట్రెండింగ్ అవుతున్నామని, మొత్తానికి పీఆర్ మంచి పని చేశాడంటూ సందీప్ అన్నట్లుగా సెటైర్‌గా రాసుకొచ్చింది.