శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 18 అక్టోబరు 2023 (18:43 IST)

టీమిండియాను ఓడిస్తే.. ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్‌తో డేట్‌కు వెళ్తా..?

Pakistani Actress
Pakistani Actress
అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. ఈ ఓటమిని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. గురువారం భారత్-బంగ్లాదేశ్‌ల మధ్య మ్యాచ్ జరుగబోతుంది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌కు పాకిస్థాన్ నటి సెహర్ షిన్వారీ ఒక బోల్డ్ ఆఫర్‌ను ప్రకటించింది. 
 
టీమిండియాపై బంగ్లాదేశ్ ప్రతీకారం తీర్చుకోవాలని ఆమె ఆకాంక్షించింది. భారత్‌ జట్టును ఓడిస్తే తాను ఢాకాకు వెళ్లి ఒక క్రికెటర్‌తో డేట్‌కు వెళ్తానని చెప్పింది. 
 
గత శనివారం జరిగిన క్రికెట్ ప్రపంచ కప్ 2023లో జరిగిన పోరులో పాకిస్తాన్ క్రికెట్ జట్టును భారత్ చిత్తు చేసింది. రోహిత్ శర్మ జట్టు ఏడు వికెట్ల తేడాతో విజయాన్ని సాధించింది. ప్రపంచ కప్‌లో ఇప్పటివరకు పాకిస్థాన్ ఆడిన మూడు మ్యాచ్‌లలో ఒకదానిలో మాత్రమే ఓడిపోయినప్పటికీ, టోర్నమెంట్‌లో ఎక్కువ దూరం వెళ్లగలగడంపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.