సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. హాలివుడ్
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (10:11 IST)

అర్జెంటీనా నటి జాక్వెలిన్ క్యారీరి మృతి.. కాస్మటిక్స్ సర్జరీ విఫలమై..?

Jacqueline Carrieri
Jacqueline Carrieri
అర్జెంటీనా మాజీ అందాల భామ, నటి జాక్వెలిన్ క్యారీరి 48 సంవత్సరాల వయస్సులో ఆసుపత్రిలో కాస్మటిక్స్ సర్జరీ విఫలమై ప్రాణాలు కోల్పోయింది. లాటిన్ అమెరికన్ సినిమా మంచి గుర్తింపును తెచ్చుకున్న ఈ భామ అందం కోసం ప్రాణాలను పణంగా పెట్టింది. దీంతో తిరిగి రాని లోకాలకు చేరుకుంది. 
 
మోడల్ నటి, కాలిఫోర్నియాలో మరణించిన వార్త ఆమె అభిమానులకు షాక్ ఇచ్చింది. ఆమె మరణానికి కారణం శస్త్రచికిత్స కారణంగా రక్తం గడ్డకట్టడం అని వెల్లడైంది. ఇది వైద్యపరమైన సమస్యలకు దారితీసింది.
 
జాక్వెలిన్ క్యారీరి తుది శ్వాస విడిచినప్పుడు ఆమె పిల్లలు క్లో, జూలియన్ ఆమె పక్కనే ఉన్నారు. 1996లో అర్జెంటీనాలోని శాన్ రాఫెల్ ఎన్ వెండిమియా గ్రేప్ హార్వెస్ట్ ఫెస్టివల్‌లో జరిగిన అందాల పోటీలో జాక్వెలిన్ తన జిల్లాకు రాణిగా ఎంపికైంది.