బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 17 అక్టోబరు 2023 (23:05 IST)

పేదింటి ఆడబిడ్డకు రూ.లక్ష నగదు, 10 గ్రాముల బంగారం

Rahul Gandhi Jodo Yatra
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకున్న నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా అక్టోబర్‌ 18న తెలంగాణలో పర్యటించి వివిధ ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొననున్నారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు ఇచ్చిన బూస్ట్‌తో దూకుడుగా వెళ్తున్న టీకాంగ్రెస్‌.. కేసీఆర్‌ పథకాలకు దీటుగా ఇప్పటికే ఆరు గ్యారెంటీ స్కీంలు ప్రకటించింది. 
 
పేద మహిళా ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ఓ ఫ్లాఫ్‌ పథకాన్ని ప్రకటించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే మహిళా కానుకగా రూ.2,500 ఇస్తామని కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీ హామీల్లో ప్రకటించింది. 
 
తాజాగా పేదింటి ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష నగదు, 10 గ్రాముల బంగారం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ హామీని ఈనెల 18న బస్సుయాత్రకు రానున్న రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీలతో ప్రకటించేందుకు ప్లాన్‌ చేసింది టీకాంగ్రెస్‌.