గురువారం, 4 సెప్టెంబరు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 19 ఆగస్టు 2025 (17:33 IST)

'గ్రాజియా ఇండియా' కవర్ పేజీపై సమంత!

samantha
టాలీవుడ్ హీరోయిన్ సమంతకు మరో అరుదైన గౌరవం దక్కింది. గ్రాజియా ఇండియా తాజా సంచిక ముఖ చిత్రం (కవర్ పేజీ)పై ఆమె ఫోటోను ప్రచురించారు. వరల్డ్ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ ఫోటోను రిలీజ్ చేశారు. 
 
మ్యాగజైన్‌లో భాగమైన ఐదుగురు మహిళా ఫొటోగ్రాఫర్లు, ఆరుగురు డిజైనర్లతో ఫొటోగ్రఫీ డే సెలబ్రేట్‌ చేసుకుంటున్నట్టు 'గ్రాజియా' పేర్కొంది. 15 ఏళ్ల నట ప్రయాణంలో గుర్తుండిపోయే పాత్రలు పోషించారంటూ 'గ్రాజియా' కొనియాడింది. తనదైనముద్ర వేశారని ప్రశంసించింది. 22 క్యారెట్ల బంగారపు ఉంగరం, గాజులతో సమంత మెరిశారు.
 
ఈ ఏడాది.. 'శుభం' సినిమాలోఅతిథి పాత్రతో ప్రేక్షకులను అలరించారు సమంత. ఆమె నిర్మించిన తొలి సినిమా ఇది. 'మా ఇంటి బంగారం' సినిమాని ఇప్పటికే ప్రకటించిన సమంత... ఇతర సినిమాలపై కూడా దృష్టిపెట్టినట్టు తెలుస్తోంది. రామ్‌చరణ్‌ హీరోగా తెరకెక్కుతున్న 'పెద్ది'లో ఆమె ప్రత్యేక గీతంలో నటించే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం జరిగింది. లోకేశ్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందనున్న 'ఖైదీ 2' చిత్రంలో సమంత నటించే ఛాన్స్‌ ఉందని తమిళ సినీ వర్గాల టాక్.