బుధవారం, 22 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 26 అక్టోబరు 2023 (10:55 IST)

నా మొదటి ముద్దు తన హీరోకే : శ్రీలీల

srileela
తెలుగు చిత్రపరిశ్రమలో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న యంగ్ హీరోయిన్ శ్రీలీల. కుర్ర హీరోలతో మొదలుపెట్టి.. సీనియర్ హీరోల వరకు వరుసబెట్టి నటిస్తున్నారు. పైగా, శ్రీలీలతో నటించేందుకు హీరోలు సైతం పోటీపడుతున్నారు. ఈ క్రమంలో తన మొదటి లిప్ లాక్ కిస్‌ను ఎవరి పెడుతుందే ఆమె తాజాగా వెల్లడించింది. 
 
ఇప్పటివరకు ఆమె నటించిన చిత్రాల్లో అధర చుంభనాలకు దూరంగా ఉంటున్నారు. తనకుంటూ కొన్ని హద్దులు ఉన్నాయని చెబుతుంది. తాజాగా ఆమె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్న ఎదురైంది. ఒకవేళ టాలీవుడ్‌లో లిప్ లాక్ సీన్ చేయాల్సి వస్తే ఏ హీరోతో చేస్తారని ఆమెను ప్రశ్నించగా, ఏ హీరోతో కూడా అలాంటి సీన్‌లో నటించనని ఆమె తేల్చి చెప్పారు. పైగా, తన మొదటి ముద్దు మాత్రం తన భర్తకేనని స్పష్టం చేసింది. 
 
కాగా, ప్రస్తుతం శ్రీలీల... వైష్ణవ్ తేజ్‌తో "ఆదికేశవ" చిత్రంలో నటించారు. ఇది విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో శ్రీలీల డ్యాన్స్ అదరగొట్టినట్టు చెబుతున్నారు. అలాగే, పవన్ కళ్యాణ్‌తో "ఉస్తాద్ భగత్ సింగ్", మహేశ్ బాబుతో "గుంటూరు కారం" చిత్రాలతో పాటు నితిన్, విజయ్ దేవరకొండ చిత్రాల్లో ఆమె నటిస్తూ బిజీగా ఉన్నారు.