సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 25 అక్టోబరు 2023 (18:12 IST)

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తెకు పెళ్లి.. వరుడు ఎవరో తెలుసా?

Aishwarya Arjun
తమిళ కమెడియన్ తంబి రామయ్య కుమారుడు ఉమాపతితో యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె వివాహం జరుగనుందని కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి. వీరి వివాహానికి పెద్దల నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని.. త్వరలో ఎంగేజ్‌మెంట్ కూడా జరుగనుందని టాక్ వస్తోంది. 
 
యాక్షన్ కింగ్ అర్జున్‌కు ఇద్దరు కుమార్తెలు. తన కుమార్తెను నటిగా నిలబెట్టేందుకు ఆయన విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. 
 
ప్రస్తుతం హీరో ఉపేంద్ర అన్న కుమారుడితో మరో సినిమాకు ప్లాన్ చేశారు. ఇక ఉమాపతి సైతం తమిళంలో ఇప్పుడిప్పుడే తన మార్కెట్‌ను పరీక్షించుకుంటున్నాడు.