ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (18:21 IST)

రామ్ చరణ్- ఉపాసన కుమార్తె ఎలా వుందో చూశారా?

Ram Charan
Ram Charan
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్- ఉపాసన దంపతులు ఈ ఏడాది జూన్‌లో అమ్మానాన్నలుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. జూన్‌ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. కాగా చాలామంది సెలబ్రిటీల్లాగే ఉపాసన దంపతులు తమ కూతురి విషయంలో ఎంతో గోప్యత పాటిస్తున్నారు. అందుకే తమ లిటిల్‌ ప్రిన్స్‌ ముఖాన్ని ఇంతవరకు చూపించలేదు. 
 
మరోవైపు క్లింకారను ఎప్పుడెప్పుడు చూద్దామా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా రామ్ చరణ్‌ కూతురంటూ సోషల్‌ మీడియాలో కొన్ని ఫొటోలు దర్శనమిస్తున్నాయి.అయితే ఇవి రియల్‌ ఫొటోలు కాదు. ఆర్టీఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహకారంతో కొందరు క్లింకార ఫొటోలను అద్బుతంగా డిజైన్‌ చేస్తున్నారు. 
 
ఈ ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ఇదిలా ఉంటే రామ్‌ చరణ్‌- ఉపాసన దంపతులు ఇటీవలే ఇటలీకి వెళ్లారు. తమ కూతురు క్లింకార కొణిదెలతోపాటు.. చరణ్ పెట్ డాగ్‌ రైమ్‏ను తీసుకొని వెళ్తూ హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించారు.