బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 23 అక్టోబరు 2023 (14:07 IST)

నన్ను మోసం చేసిన వ్యక్తికి మద్దతిస్తున్నారు.. గౌతమి

Gautami
నటి, బీజేపీ నాయకురాలు గౌతమి బీజేపీకి షాకిచ్చింది. గౌతమి బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆమె లేఖ ద్వారా తెలియజేశారు. చాలా బరువెక్కిన హృదయంతో బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు లేఖలో వెల్లడించారు.  
 
గత 25 సంవత్సరాల క్రితం దేశ నిర్మాణానికి దాని ప్రయత్నాలను అందించడానికి బీజేపీ పార్టీలో చేరాను అని గౌతమి చెప్పారు. 
 
తన జీవితంలో తాను ఎదుర్కొన్న అన్ని సవాళ్లు ఉన్నప్పటికీ.. తన జీవితంలో సోమవారం ఊహించలేని సంక్షోభం నెలకొంది. పార్టీ నుంచి, నేతల నుంచి తనకు ఎలాంటి మద్దతు లభించలేదన్నారు. 
 
తనను నమ్మించి మోసం చేసిన వ్యక్తికి కొందరు మద్దతిస్తున్నారని తెలిసింది. అందుకే బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తున్నానని గౌతమి ఆరోపించారు.