శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 అక్టోబరు 2023 (23:41 IST)

హాస్పిటల్ బెడ్‌పై సునైనా.. ఆమెకు ఏమైంది..?

Actress Sunaina
Actress Sunaina
టాలీవుడ్ యంగ్ బ్యూటీ సునైనా హాస్పిటల్ బెడ్‌పై కనిపించింది. కుమార్ వర్సెస్ కుమారి హీరోయిన్ సునైనా, తెలుగులో ఒక్క సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి ప్రస్తుతం ఆసుపత్రిలో బెడ్‌పై ఉంది.
 
ఆసుపత్రిలో బెడ్‌పైకి వెళ్లేంతగా హెల్త్ సీరియస్ కావడంపై తమిళ సినీ ప్రేక్షకులు, తెలుగు ఆడియన్స్ కంగారు పడుతున్నారు. నటి హాస్పిటల్‌లో బెడ్‌పై ఉన్న ఫోటోని షేర్ చేస్తూ ఈ విధంగా కామెంట్ పెట్టింది. 
 
తనకు కొంత సమయం ఇవ్వాలని.. మళ్లీ తిరిగి వస్తానని ఫోటో కింద కామెంట్ పెట్టడంతో ఏమైందని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ఆమెకు ఏమైంది..? ఏ ఆసుపత్రిలో ఉందనే విషయాన్ని మాత్రం తెలపలేదు.