సోమవారం, 14 అక్టోబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 22 సెప్టెంబరు 2023 (08:54 IST)

నా బిడ్డతో పాటు నేనూ చనిపోయా : విజయ్ ఆంటోనీ

vijay antony
హీరో విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. దీనిపై విజయ్ ఆంటోనీ ఓ భావోద్వేగ ట్వీట్ చేశారు. నా బిడ్డతో పాటు తానూ చనిపోయానని చెప్పారు. ఇక నుంచి తాను చేసే ప్రతి మంచి పని ఆమె పేరుతోనే ప్రారంభిస్తానని చెప్పారు. ఇదే విషయంపై ఆయన గురువారం ఓ ట్వీట్ చేశారు. అందులో... 
 
తన కుమార్తె ప్రేమగల ఎంతో ధైర్యవంతురాలైన అమ్మాయి. ఇపుడు ఆమె ఏ కులం, మతం, డబ్బు, అసూయ, బాధ, పేదరికం, శత్రుత్వం లేని ఓ మంచి ప్రశాంతమైన ప్రదేశానికి వెళ్లిపోయింది. తన కుమార్తె ఇప్పటికీ తనతో మాట్లాడుతూనే ఉంది. తాను కూడా తన కుమార్తెతో పాటు చనిపోయానని తెలిపారు. ఇక నుంచి తాను ఏ మంచి పని చేసినా ఆమె కోసమే చేస్తాను. ఆమె పేరుమీదే చేస్తాను అని విజయ్ ఆంటోనీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ స్కూల్‌లో చదువుతూ వచ్చిన మీరా విజయ్ ఆంటోనీ మూడు రోజుల క్రితం ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్న విషయం తెల్సిందే.