1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (23:21 IST)

విజయ్ ఆంటోనీ కుమార్తె ఆత్మహత్య.. సూసైడ్ నోట్.. మిస్ యూ ఆల్..?

Vijay Antony
సంగీత దర్శకుడు, నటుడు, బిచ్చగాడు ఫేమ్ విజయ్ అంటోనీ కుమార్తె ఆత్మహత్య కోలీవుడ్‌వు దిగ్భ్రాంతికి గురిచేసింది. విజయ్ ఆంటోనీ తన కుటుంబంతో చెన్నైలో నివాసం వుంటున్నారు. ఆయనకు మీరా అనే కుమార్తె వుండేది. 
 
ఈమె ఇంటర్ చదువుతూ వచ్చింది. ఏమైందో ఏమో కానీ మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో మీరా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైద్య పరీక్షల అనంతరం ఆమె మృతదేహానికి ఆమె కుటుంబీకులు నివాళులు అర్పించారు. 
 
ఇక విచారణలో పోలీసులకు ఒక లేఖ లభించినట్లు సమాచారం వెలువడింది. ఆ లేఖలో 'ఐ లవ్యూ ఆల్. మిస్ యూ ఆల్' అని రాసి వుందని పోలీసులు చెప్పారు. ఇంకా పది లైన్లతో ఆంగ్లంతో రాసిన సూసైడ్ నోట్ గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పలు కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు.