గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 18 సెప్టెంబరు 2023 (11:44 IST)

కుమార్తెకు బర్త్‌డే గిఫ్ట్... చందమామపై ఎకరా భూమి కొనిచ్చిన తండ్రి!

land on moon
తన ముద్దుల గారాలపట్టికి ఓ కన్నతండ్రి అరుదైన బహుమతిని ఇచ్చాడు. చందమామపై ఎకరం భూమిని కొనిచ్చాడు. ఆ భూమిని తన కుమార్తె పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన షేక్ ఆసిఫ్ తన కూతురుకు ఈ కానుక ఇచ్చాడు. 
 
బెంగుళూరులోని ఓ ప్రైవేట్ బ్యాంకులో ఉద్యోగం చేస్తున్న షేక్ ఆసిఫ్‌కు గత యేడాది నవంబరు నెలలో కుమార్తె పుట్టింది. ఆమెకు మైషా అని పేరు పెట్టింది. కుమార్తెను అపురూపంగా పెంచుకుంటున్న ఆసిఫ్.. తన గారాలపట్టి తొలి బర్త్‌డేకు అంతే అపూరమైన కానుక ఇవ్వాలని భావించినట్టు చెప్పాడు.
 
ఈ క్రమంలో ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రాజెక్టు సక్సెస్ తర్వాత చంద్రమండలంపై భూమి అమ్మకాలు పెరిగాయి. ఈ వార్తను పత్రికల్లో చూసిన ఆసిఫ్ తన కుమార్తె కోసం చంద్రుడిపై ల్యాండ్ కొనాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం అమెరికాకు చెందిన లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ సంస్థను సంప్రదించాడు. చంద్రుడిపై ఒక ఎకరం భూమి కొనుగోలుకు దరఖాస్తు చేసుకోగా, బే ఆఫ్ రెయిన్‌బో ప్రాంతంలో భూమి విక్రయిస్తున్నట్టు ఆసిఫ్‌కు మెయిల్ వచ్చింది. 
 
ఎకరా భూమి ధరకు రిజిస్ట్రే,న్ సహా ఇతరాత్రా చార్జీలు కలిపి మొత్తం రూ.11,600 ఖర్చువుతుందని, తెలుపగా, ఆసిఫ్ ఆన్‌లైన్‌లో ఈ పేమెంట్ చేశారు. దీంతో షేక్ మైషా పేరుతో చంద్రుడిపై ఎకరా భూమిని రిజిస్టర్ చేసినట్టు లూనార్ సొసైటీ ఇంటర్నేషనల్ వెల్లడించి, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన పత్రాలను ఆసిఫ్‌కు రిజిస్టర్ పోస్టు ద్వారా చేరవేసింది. కొరియర్ ద్వారా ఆదివారం ఈ డాక్యుమెంట్లను అందుకున్న ఆసిఫ్... ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.