శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (09:33 IST)

సెల్ఫీ తీసుకున్న ఆదిత్య ఎల్-1.. భూమి, చంద్రుడి చిత్రాలు అదుర్స్

Adithya 1
Adithya 1
సూర్యుని రహస్యాలను అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఆదిత్య ఎల్-1 మిషన్‌ను చేపట్టిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 2న శ్రీహరికోట నుంచి ఈ మిషన్ ప్రయోగించగా.. ఆదిత్య ఎల్-1 ప్రస్తుతం భూమి చుట్టూ తిరుగుతోంది. ఆదిత్య కక్ష్య క్రమంగా పెరుగుతోంది. 
 
భూమి కక్ష్యను దాటిన తరువాత, అది సూర్యుని వైపు కదులుతుంది. 125 రోజులు 15 లక్షల కి.మీ. ప్రయాణించి పాయింట్ L1కి చేరుకుంటుంది. అక్కడి నుంచి సూర్యుడిపై పరిశోధనలు చేయనుంది. మరోవైపు, ఆదిత్య భూమి కక్ష్యలో తన పనిని ప్రారంభించింది. 
 
ఇంకా అది సెల్ఫీ తీసుకుంది. అదే విధంగా భూమి, చంద్రుడి చిత్రాలను తీశారు. వీటిని ఇస్రోకు పంపించారు. ఆదిత్య-ఎల్1 సెప్టెంబర్ 2వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ నుండి ప్రారంభించబడింది.