ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్

'మిస్సింగ్ దిస్ కిడ్' : మంత్రి కేటీఆర్ భావోద్వేగ పోస్ట్

ktr - himanshu
అమెరికాలో చదువుకుంటున్న తన కుమారుడు హిమాన్షు గురించి తెలంగాణ మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో ఓ భావోద్వేగ పోస్ట్ చేశారు. హమాన్షు ఫోటోను నెట్టింట షేర్ చేస్తూ మంత్రి భావోద్వేగానికి గురయ్యారు. "మిస్సింగ్ దిస్ కిడ్" అంటూ తన కుమారుడితో కలిసివున్న ఫోటోను మంత్రి కేటీఆర్ షేర్ చేసారు. దీన్ని చూసిన నెటిజన్లు ఇపుడు బెంగగా ఉన్నా తర్వాత కుమారుడి విజయాలకు గుర్విస్తారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 
 
కాగా, ఉన్నత చదువుల కోసం హిమాన్షు అమెరికాకు వెళ్లిన విషయం తెల్సిందే. గచ్చిబౌలిలోని ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో ఇంటర్మీడియట్ అనంతరం హిమాన్షు ఈ ఆగస్టు నెలలో అమెరికాకు వెళ్లాడు. ఆయన వెంట కేటీఆర్, శైలిమ దంపతులు, చెల్లి అలేఖ్య కూడా వెళ్లారు. ఈ క్రమంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయ్యాక వారం రోజులకు కేటీఆర్ తన కుటుంబ సభ్యులతో కలిసి స్వదేశానికి తిరిగి వచ్చారు.