మంగళవారం, 26 ఆగస్టు 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2023 (20:30 IST)

ఎన్డీయేలో చేరేందుకు మాకేమైనా కుక్క కరిచిందా? ప్రధాని మోదీ వ్యాఖ్యలపై కేటీఆర్

ktramarao
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిజామాబాద్ సభలో అద్భుతంగా నటించారంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేసారు. రాష్ట్రాభివృద్ధిని తెలుసుకోకుండా మిడిమిడిజ్ఞానంతో ఆయన మాట్లాడారని విమర్శించారు. అసలు ప్రధాని స్థాయిలో వున్న వ్యక్తి ఇలాంటి పచ్చి అబద్ధాలు మాట్లాడటం బాధాకరమని అన్నారు.
 
ఎన్డీయేలో కలవాలని కేసీఆర్ తనతో అన్నట్లు ప్రధాని మోదీ చెప్పడం హాస్యాస్పదం అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్డీయే మునిగిపోయే నౌక. అందులో ప్రయాణించాలని ఎవరూ అనుకోరు. కేసీఆర్ ఓ ఫైటర్. అలాంటివారు చీటర్ తో కలవరు. ఎన్డీయేతో కలిసేందుకు మాకేమైమా కుక్క కరిచిందా? ఎన్డీయే విధానాలు నచ్చక ఇప్పటికే ఎన్నో పార్టీలు ఆ కూటమి నుంచి బయటకు వచ్చేసాయి. అలాంటి కూటమిలోకి ఎవరైనా వెళ్లాలనుకుంటారా? అందులో వున్న ఈడీ, ఐటీ, సీబీఐ" అని సెటైర్లు వేసారు.