ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : బుధవారం, 27 సెప్టెంబరు 2023 (08:41 IST)

కేసీఆర్‌కు వైరల్ ఫీవర్.. మంత్రి కేటీఆర్ ట్వీట్

kcrao
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గత వారం రోజులుగా వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్నారని ఆయన తనయుడు, ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని, కొన్ని రోజుల్లోనే సాధారణ స్థితికి చేరుకుంటారని తెలిపారు.
 
సీఎం కేసీఆర్ ఉన్నట్టుండి అస్వస్థతకు లోనయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్నారని చెప్పిన ఆయన త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటారని చెప్పారు.