సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 15 సెప్టెంబరు 2023 (08:20 IST)

విష జ్వరమా లేక నిఫా వైరస్ సోకిందా? పెద్దపల్లిలో బాలిక అనుమానాస్పద మృతి

తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక అనుమానాస్పదంగా మృతి చెందింది. విష జ్వరంతో బాధపడుతూ వచ్చిన ఈ బాలిక చనిపోయిందని వైద్యాధికారులు చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం దేశంలో నిఫా వైరస్ కలకలం రేగింది. ఈ వైరస్ సోకి కేరళ రాష్ట్రంలో నలుగురు చనిపోగా మరికొంత మందికి ఈ వైరస్ సోకింది. దీంతో ఏడు గ్రామాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో పెద్దపల్లి జిల్లాలో ఓ బాలిక విషజ్వరంతో చనిపోవడం గమనార్హం. 
 
ఆ బాలిక హన్మకొండ జిల్లా మడికొండలోని గురుకులంలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంది. ఆ బాలికకు వారం రోజులుగా జ్వరం వస్తూపోతుంది. జమ్మికుంట ప్రభుత్వాసుపత్రికి తసుకెళుతుండగా మార్గమధ్యంలోనే ఆమె చనిపోయారు. విషజ్వరంతో బాలిక మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలొకంది. మృతురాలిని ఆరేపల్లి గ్రామ పరిధిలిలోని మల్లయ్యపల్లెకు చెందిన కోడి శ్యాం రజితల పెద్ద కుమార్తె అశ్వితగా గుర్తించారు.