బుధవారం, 22 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. వ్యాధి
Written By సిహెచ్
Last Modified: సోమవారం, 14 ఆగస్టు 2023 (22:11 IST)

జ్వరం వచ్చినప్పుడు తినకూడని ఆహార పదార్థాలు ఏమిటి?

Fever
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ముఖ్యంగా రోగికి జ్వరం వచ్చినప్పుడు పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఐతే జ్వరంగా వున్నప్పుడు కొన్ని పదార్థాలకు దూరంగా వుండాలి. అవేంటో తెలుసుకుందాము. తృణధాన్యాలు వాటి ఉత్పత్తులలో అధిక ఫైబర్ వుంటుంది, కనుక వీటికి దూరంగా వుండాలి. ముఖ్యంగా పొట్టుతో కూడిన పప్పులు తీసుకోరాదు.
 
క్యాబేజీ, క్యాప్సికమ్, ముల్లంగి, ఉల్లిపాయలు, వెల్లుల్లి మొదలైన వాటిని జ్వరం సమయంలో దూరం పెట్టాలి. పకోడి, లడ్డూలు, సమోసా మొదలైన వేయించిన, కొవ్వు పదార్ధాలు తినకూడదు.
మసాలాలు, ఊరగాయ, చట్నీ వంటి వాటిని తినకపోవడం మంచిది.
 
జ్వరంగా వున్నప్పుడు గోరువెచ్చని పాలు తాగితే మేలు కలుగుతుంది. సాధ్యమైనంత వరకూ గోరువెచ్చని మంచినీటిని తాగుతుండాలి.