ఉదయం పూట పండ్లు ఎవరు తీసుకోకూడదు?
ఉదయం పూట పండ్లు తినడంపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జీవక్రియ అనేది వ్యక్తిని బట్టి మారుతూ ఉంటుంది. శరీర రకం కూడా మారుతూ ఉంటుంది. దాని ప్రకారం పండ్లు తీసుకోవాలి. ఎందుకంటే ప్రతి పండులో వివిధ ఎంజైములు, ఆమ్లాలు ఉంటాయి. అవి పేగులోని బ్యాక్టీరియాతో ప్రతిస్పందిస్తాయి. ఆ పండ్లు వాటి విధులను బట్టి ప్రయోజనకరంగా ఉంటాయా? అనేది తెలుసుకోవాల్సి వుంది.
ఉదయం పూట పండ్లు ఎవరు తీసుకోకూడదు?
ఎసిడిటీ, గుండెల్లో మంట, జలుబు, దగ్గు, సైనస్, అలర్జీ, ఆస్తమా, జ్వరం, బ్రాంకైటిస్, మధుమేహం, ఊబకాయం వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినడం మానుకోవాలి.
ఎవరు తినాలి?
మలబద్ధకం, చర్మం పొడిబారడం, జుట్టు పొడిబారడం, డైజెస్టివ్ డిజార్డర్, మెటబాలిక్ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడేవారు ఉదయాన్నే పండ్లు తినవచ్చు. పండ్లు జీర్ణాశయంలో బ్యాక్టీరియా కార్యకలాపాలను మెరుగుపరుస్తాయి. జీర్ణక్రియ విధులను ప్రేరేపిస్తుంది.
ఎలా తినాలి?
పండ్లను అలానే తినాలి. కూరగాయలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలతో కలపవద్దు. పండ్లను మాంసంతో కలపకూడదు. ఎందుకంటే ఆ ఆహారాలు విషపూరితంగా మారతాయి. కావాలంటే డ్రై ఫ్రూట్స్‌తో పాటు పండ్లను కూడా తినవచ్చు.
ఉదయం పూట పండ్లు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
మన శరీరంలో ఉదయం 7 నుంచి 11 గంటల మధ్య డిటాక్సిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది. పండ్లు దానికి అవసరమైన శక్తిని ఇస్తాయి.
ఇతర ఆహార పదార్థాలతో పోలిస్తే పండ్లు తేలికగా జీర్ణమవుతాయి. ఉదయాన్నే వీటిని తింటే మెటబాలిక్ రేటు పెరుగుతుంది. ఉదయం నిద్రలేచిన వెంటనే శరీరానికి సహజ చక్కెర అవసరం. పండ్లు తినడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది.