సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

మార్నింగ్ వాక్ చేస్తున్న డీఐజీ ఫోనునే చోరీ చేశారు... ఎక్కడ?

thieves
కొందరు దొంగలు.. తమ చేతివాటాన్ని బాగానే ప్రదర్శిస్తుంటారు. తాజాగా ఓ డీఐజీ ఫోనును కొట్టేశారు. డీజీపీ మార్నింగ్ వాక్ చేసుతుండగా, ఈ చోరీ జరిగింది. ఈ ఘటన పోలీసు వర్గాలను విస్మయానికి గురిచేసింది. తలవంపులు తెచ్చిపెట్టింది. సాక్షాత్ ఓ రాష్ట్ర డీఐజీ ఫోనును కొట్టేయడం సిగ్గుచేటని పేర్కొంటున్నారు. ఈ ఘటన అస్సాం రాష్ట్రంలో జరిగింది. 
 
ఈ రాష్ట్ర రాజధాని గౌహతిలో ఆదివారం వెలుగు చూసింది. ఈ రాష్ట్ర లా అండ్ ఆర్డర్ విభాగం డీఐజీగా ఉన్న వివేక్ రాజ్ సింగ్ ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్నారు. ఆ సమయంలో బైకుపై వచ్చిన ఇద్దరు దొంగలు ఆయన ఫోనును లాక్కొని పారిపోయారు. ఈ ఘటన ఆ రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయానికి కూతవేటు దూరంలోవున్న మాజర్ రోడ్డులో జరిగింది. పైగా, ఆ రోడ్డు పక్కనే అనేక ఐపీఎస్ అధికారుల అధికారిక నివాసాలు కూడా ఉండటం గమనార్హం. 
 
ఈ చోరీ ఘటనపై గౌహతి పోలీస్ అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రీతిబీ రాజ్‌ఖోవా స్పందిస్తూ, ఈ ఘటన పల్టన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిందని, దీనిపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. నిందితుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నామన్నారు. అయితే, ఈ చోరీ ఘటన పోలీసు శాఖకు తలవంపులు తెచ్చిపెట్టిందని కొందరు పోలీస్ ఉన్నతాధికారులు వాపోతున్నారు.