శుక్రవారం, 8 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. భారతీయ
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 మార్చి 2023 (19:14 IST)

అరటి ఆకు రసం.. టేస్ట్ చేస్తే జలుబు, జ్వరం మటాష్

Banana Leaf Rasam
Banana Leaf Rasam
అరటి ఆకులో తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. లిగ్నిన్, అల్లాంటోయిన్, హెమిసెల్యులోజ్, పాలీఫెనాల్స్, ప్రొటీన్లు వంటి అద్భుతమైన పోషకాలు వున్నాయి. గొంతు సమస్య ఉంటే అరటి ఆకును ఒక గ్లాసు నీళ్లలో వేసి మరిగించండి. దీన్ని రోజుకు రెండుసార్లు తీసుకుంటే గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. అరటి ఆకు నీరు చర్మంలోని బ్యాక్టీరియాను నశింపచేస్తుంది. అరటి ఆకులు ఆరోగ్యానికి, చర్మానికి మేలు చేస్తాయి. అలాంటి అరటి ఆకుతో ఆయుర్వేద ప్రయోజనాలను అందించే రసం ఎలా చేయాలో చూద్దాం.. 
 
కావలసిన పదార్థాలు 
చిన్న అరటి ఆకు - 1 
టొమాటో - 1 
ఎండు మిర్చి - 3 
జీలకర్ర - ఒక టేబుల్ స్పూన్ 
మిరియాలు - ఒక టేబుల్ స్పూన్
చింతపండు - నిమ్మకాయ సైజు 
వెల్లుల్లి - 8 
పసుపు పొడి - 1 చిటికెడు 
ఉప్పు- తగినంత
కొత్తిమీర, కరివేపాకు - పావు కప్పు 
నూనె - కావలసినంత.
 
తయారీ విధానం 
చిన్నపాటి అరటి ఆకును బాగా కడిగి ముక్కలుగా కోయాలి. టొమాటోలను ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. అరటి ఆకులు, వెల్లుల్లి, మిరియాలు, జీలకర్ర, టొమాటోలను పేస్ట్‌గా రుబ్బుకోవాలి. బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, కరివేపాకు, ఎండు మిరపకాయలు వేసి ఆపై రుబ్బిన మసాలా వేసి బాగా వేయించాలి. మసాలా బాగా వేగిన తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసి కొద్దిగా ఉడికిన తర్వాత అందులో కొత్తిమీర తరుగు చల్లుకోవాలి. అంతే హాట్ అండ్ టేస్టీ హెల్తీ అరటి ఆకు రసం రెడీ. దీనిని అన్నంలో వేడి వేడిగా తీసుకుంటే.. లేకుంటే సూప్ లాగా తాగవచ్చు. ఇది జ్వరం, జలుబుతో బాధపడేవారికి ఇది మంచి ఔషధమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు.