సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 20 జూన్ 2023 (09:14 IST)

కేరళ జ్వరం జ్వరం.. 3678 మందికి డెంగ్యూ!

dengue
కేరళలో నైరుతి రుతుపవనాలు వారం ఆలస్యంగా 8వ తేదీన ప్రారంభమయ్యాయి. వర్షాకాలం ప్రారంభం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా జ్వరాల తాకిడి కూడా పెరుగుతోంది. దీంతో రాష్ట్ర వైద్యారోగ్య శాఖ జ్వరాల నివారణకు చర్యలు ముమ్మరం చేసింది. 
 
అలాగే రాష్ట్రవ్యాప్తంగా జ్వరాల బారిన పడిన వారి సంఖ్య వివరాలను సేకరించారు. ఇందులో రాష్ట్రవ్యాప్తంగా ఒక లక్షా 43 వేల 377 మంది జ్వరాల బారిన పడినట్లు గుర్తించారు. వీరంతా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 
 
చాలామందికి డెంగ్యూ జ్వరం కూడా ఉన్నట్లు గుర్తించారు. అనంతరం వారి రక్త నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. వీరిలో 3678 మందికి డెంగ్యూ సోకినట్లు గుర్తించారు. వారికి ఇంటెన్సివ్‌ ట్రీట్‌మెంట్‌ అందించేందుకు రాష్ట్ర ఆరోగ్యశాఖ ఏర్పాట్లు చేసింది.