గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 జూన్ 2023 (08:53 IST)

దేశ వ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు

rain
నైరుతి రుతుపవనాలు శనివారం ఈశాన్య భారతం వరకు విస్తరించాయి. కేరళలో మిగిలిన
ప్రాంతాలు, కర్ణాటకలో కొంత ప్రాంతం, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో అనేక ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు విస్తరించాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. 
 
రానున్న 48 గంటల్లో కర్ణాటకలో మరికొన్ని ప్రాంతాలు, గోవా, మహారాష్ట్ర, తమిళనాడు, బంగాళా ఖాతంలో మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య భారతంలో మిగిలిన భాగాలు, పశ్చిమ బెంగాల్, సబ్ హిమాలయాల్లో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని వెల్లడించింది.
 
అయితే, తూర్పు మధ్య అరేబియా సముద్రంలో కొనసాగుతున్న అతి తీవ్ర తుఫాన్ 'బిపోర్ జాయ్' శనివారం రాత్రికి అసాధారణ తీవ్ర తుఫాన్‌గా మారింది. ఈ క్రమంలో వాయువ్యంగా దిశ మార్చుకుని ఆదివారానికి స్వల్పంగా బలహీనపడి అతితీవ్ర తుపాన్‌గా మారనున్నదని తెలిపింది. ఈనెల 15వ తేదీ వరకు అతి తీవ్రతుఫాన్ సముద్రంలో కొనసాగుతుందని వివరించింది.