బుధవారం, 1 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 జూన్ 2023 (16:30 IST)

కండెక్టర్ అవతారం ఎత్తనున్న సీఎం సిద్ధరామయ్య

siddaramaiah
కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం స్కీం శక్తి యోజనను స్వయంగా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రారంభించనున్నారు. ఇందుకోసం ఆయన కండక్టర్ అవతారం ఎత్తనున్నారు. బెంగళూరులో మెజిస్టిక్ బస్ స్టేషన్ నుంచి విధాన సౌధ రూట్‌లో నడిచే బస్సులో కండక్టర్‌గా మారనున్నారు. 
 
బస్సులో స్వయంగా మహిళలకు స్మార్ట్ కార్డులు పంపిణీ చేస్తారని సీఎం కార్యాలయ వర్గాలు తెలిపాయి. బీఎంటీసీ బస్సుకు సిద్ధరామయ్య కండక్టర్‌గా వ్యవహరిస్తారని ఆర్టీసీ అధికారులు తెలిపారు. రూట్ నెం.43లో బస్ కండక్టర్‌గా మహిళలకు స్మార్ట్ కార్డులు అందజేస్తారని తెలిపారు.