కీర్తి సురేష్‌కు ఆఫర్లే ఆఫర్లు.. చేతిలో అరడజన్ సినిమాలు
కీర్తి సురేష్‌కు ఆఫర్లు వెల్లువల్లా వస్తున్నాయి. చేతిలో ఆమె అరడజను సినిమాలను కలిగివుంది. అందులో మొదటిది చిరంజీవి భోళా శంకర్. చెల్లెలి పాత్రే అయినా మెగాస్టార్ కాంబినేషన్ కాబట్టి మంచి మెమరీ అవుతుంది.
ఉదయనిధి స్టాలిన్ తో చేసిన మామన్నన్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కర్ణన్ ఫేమ్ మారి సెల్వరాజ్ దర్శకుడు. ఈ సినిమాకు ఇంకా తెలుగు డబ్బింగ్ హక్కులు పూర్తి కాలేదు. అలాగే జయం రవితో సైరన్ అనే సినిమాలో కీర్తి సురేష్ నటిస్తోంది.
అలాగే ఆకాశం నీ హద్దురా తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న సుధా కొంగర తీయబోయే ప్యాన్ ఇండియా మూవీలోనూ కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇలా అరడజను సినిమాలతో బిజీబిజీగా వున్న కీర్తి.. ఏ సినిమా ద్వారా హిట్ అవుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.