1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
  4. Smart Copying In JEE Advanced Exams At Hyderabad

జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల్లో స్మార్ట్ కాపీయింగ్

online exam
దేశంలోని ఐఐటీ విద్యా సంస్థల్లో ఉన్న బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జాతీయ స్థాయిలో జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలను నిర్వహించారు. ఈ పరీక్షల్లో స్మార్ట్‌ కాపీయింగ్‌ జరిగింది. దీనికి సంబంధించి ఓ విద్యార్థిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
సికింద్రాబాద్‌లోని ఎస్‌వీఐటీ సెంటర్‌లో చింతపల్లి చైతన్య కృష్ణ అనే విద్యార్థి తాను రాసిన జవాబులను వాట్సాప్‌ ద్వారా మిత్రులకు పంపించాడు. మొత్తం నలుగురు విద్యార్థులకు జవాబులు పంపించనట్లు పోలీసులు గుర్తించారు. వారంతా కూడా వివిధ సెంటర్లలో పరీక్ష రాస్తున్నవారే కావడం గమనార్హం. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 
కాగా, దేశంలోని 23 ఐఐటీల్లో వచ్చే విద్యా సంవత్సరం (2023-24) బీటెక్‌ సీట్ల భర్తీకి ఆదివారం జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష నిర్వహించారు. ఆన్‌లైన్‌ విధానంలో జరిపిన ఈ పరీక్షకు తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు 35 వేల మంది హాజరైవుంటారని అంచనా. ఈసారి కటాఫ్‌ మార్కులు సుమారు 60గా ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.  
About Writer
ఠాగూర్
తర్వాతి కథనం
దరఖాస్తుల్లో తప్పొప్పుల సవరణకు చివరి అవకాశం