ఒక సీన్ కోసం 35 టేక్‌లు తీసుకున్నాడు
ఈమధ్య దర్శక, నిర్మాతలు నటీనటులుగా అంతా కొత్తవారిని తీసుకోవడం అలవాటైపోయింది. తాజాగా అన్ స్టాపబుల్ అనే సినిమాలో దర్శక నిర్మాతలు సురేష్ అనే జర్నలిస్టును నటుడిగా ఎంచుకున్నారు. ఆయనకోసం ప్రత్యేక పాత్ర కూడా క్రియేట్ చేశారట. అందులో ఆయన పాత్ర పేరు హలెలోయ.. ఇది ఓ మతానికి సంబంధించిన పదం. ప్రార్థన తర్వాత వారు పలికే పవిత్ర పదం. దాన్ని కూడా కామెడీగా చేసి ఆ జర్నలిస్టుచేత పాత్ర వేయించారు. ఈ పాత్ర కమేడియన్ సప్తగిరితోపాటు ట్రావెల్ అవుతుంది. రెండు రోజుటపాటుచేసిన ఈ పాత్రకు ఒకసీన్ చేయడానికి దాదాపు 35 టేక్‌లు తీసుకున్నాడని తెలిసింది.
ఇన్ని టేక్‌లు చేసే అతన్ని నటుడిగాకంటే ఎంతోమంది కళాకారులు వుండగా ఆయన్నే ఎందుకు తీసుకున్నారనేందుకు నిర్మాత చక్కటి సమాధానం ఇచ్చారు. నాకు పబ్లిసిటీపరంగా తను బాగా సహకరించాడని, తను చాలా మంచివాడని కితాబిచ్చాడు. ఆమధ్య ఆ జర్నలిస్టు ఏర్పాటు చేసిన అవార్డుల పంక్షన్‌లో ఈ నిర్మాతకు స్టేజీమీద పిలిపించి సత్కరించారు. సో. దేనికైనా ఓ లెక్క వుంటుందని సినీవర్గాలు అనుకుంటున్నాయి.