గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By డీవీ
Last Updated : శనివారం, 3 జూన్ 2023 (15:56 IST)

కమేడియన్స్‌ కోరికలు తీర్చాలంటే కష్టమే: నిజం చెప్పిన బ్రహ్మానందం

Brahmanandam
Brahmanandam
సినిమాలో కమేడియన్స్‌ పాత్ర చాలా కీలకం. కూరలో అన్ని దినుసులు వున్నట్లే ఎటువంటి సినిమాకైనా ఉప్పులాంటి దినుసు కామెడీ అని గతంలో చాలాసార్లు పెద్దలు చెప్పారు. అందుకే బ్రహ్మానందంను ప్రత్యేకంగా తీసుకునేవారు. ఒకదశలో హీరోకు స్థాయిగా ఆయన పాత్రలు వుండేవి. దానికితోడు కమేడియన్‌ను తీసుకోవాలంటే వారిని నిర్మాత భరించాలి. వారికి కొన్ని కోరికలు వుంటాయి. ఈ విషయాన్ని స్వయంగా బ్రహ్మానందమే సెలవిచ్చారు. 
 
ఈరోజు జరిగిన అన్‌ స్టాపబుల్‌ సినిమా ట్రైలర్‌ ఆవిష్కరణలో ముఖ్య అతిథిగా బ్రహ్మానందం పాల్గొన్నారు. అనంతరం ఆయన అందరినుద్దేశించి మాట్లాడారు. ఈ ట్రైలర్‌ చూస్తుంటే గతంలో ఇవి.వి. సత్యనారాయణ, జంథ్యాల సినిమాలు గుర్తుకు వచ్చాయి. కమేడియన్లందరినీ పెట్టి సినిమా తీసేవారు. ఇప్పుడు డైమండ్‌ రత్నబాబు కూడా దర్శకుడిగా అందరినీ పెట్టితీశారు. నేను ఇందులో నటించలేదు. ఇక నిర్మాతలు ఇద్దరు. వారిని అభినందించాలి. సహజంగా ఒకరిద్దరు కమేడియన్ల వుంటేనే వారిని భరించడం కష్టం. వారికి చాలా కోరికలుంటాయి.అలాంటిది దాదాపు ఇండస్ట్రీలోని కమేడియన్లందరినీ శాటిస్‌ఫై చేసి సినిమా తీశారంటూ అభినందించారు.
 
కమేడియన్స్‌ను భరించాలంటే పారితోషికంతోపాటు వారికి సెపరేట్‌ కార్‌వాన్‌, స్టార్‌ హోటల్‌ ఫుడ్‌ వుండాలనేది ఇండస్ట్రీ టాక్‌. ఇవన్నీ కాకుండా మరేమైనా కోరికలున్నాయోకానీ బ్రహ్మానందం మాటలు సెస్సేషనల్‌ అయ్యాయి. ఆయనా ఒకపుడు స్టార్‌ కమేడియన్‌కదా. అనుభవం మీద చెప్పినట్లున్నాడని తెలుస్తోంది.