నటుడిగా సక్సెస్ అయ్యాననే భావిస్తాను : హీరో బెల్లంకొండ గణేష్
హీరో బెల్లంకొండ గణేష్ నేను స్టూడెంట్ సర్'తో థ్రిల్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ 2 ఎంటర్ టైన్‌మెంట్‌పై నాంది సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. అవంతిక దస్సాని ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్నారు. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో హీరో బెల్లంకొండ గణేష్ చిత్ర విశేషాలని పంచుకున్నారు.
నేను స్టూడెంట్ సర్' టైటిల్ ఎంతవరకు యాప్ట్ గా వుంటుంది ?
నేను ఎప్పుడూ స్టూడెంట్ లానే ఫీలవుతాను. రియల్ లైఫ్ లో జరిగే పరిస్థితులు ఇందులో ఎక్కువగా వుంటాయి. రియల్ ఇన్సిడెంట్స్ ని చాలా యూనిక్ గా చూపించారు. చివరి వరకూ చాలా క్యూరియాసిటీ వుంటుంది. క్లైమాక్స్ వచ్చే వరకూ అసలు విలన్ ఎవరనేది ఊహించలేరు. అది మాత్రం వందశాతం హామీ ఇవ్వగలము.
రాకేష్ గారు ఈ కథ చెప్పినపుడు మిమ్మల్ని ఆకట్టుకున్న అంశాలు ఏమిటి ?
ఈ కథని కృష్ణ చైతన్య గారు రాశారు. రాకేష్ గారు స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చేశారు. కృష్ణ చైతన్య గారు కథ చెప్పినపుడు ఇందులో వున్న ఎమోషన్, క్యారెక్టర్ ఆర్క్ కి బాగా కనెక్ట్ అయ్యాను. స్వాతిముత్యం లో నా పాత్ర మొదటి నుంచి చివరి వరకు అమాయకంగానే వుంటుంది. నేను స్టూడెంట్ సర్' లో మాత్రం డిఫరెంట్ షేడ్స్ ఉన్నాయి. హ్యాపీ గా మొదలై మధ్యలోకి వచ్చేసరికి బాధ, టెన్షన్ ఉంటూ చివర్లో ఎదురుతిరిగి తనకు వచ్చిన కష్టం నుంచి ఎలా బయటపడ్డాడనే క్యారెక్టర్ ఆర్క్ నాకు చాలా నచ్చింది.
రాకేష్ గారు ఈ కథ చాలా ట్విస్ట్ లతో వెళుతుందని చెప్పారు.. దానికి కారణం ఏమిటి ?
ముందుగా చెప్పినట్లు .. ఈ కథలోని క్యారెక్టర్ ఆర్క్ అలా డిజైన్ చేశారు. ఒక పరిస్థితి నుంచి బయటపడిన వెంటనే మరో సంఘటన ఎదురౌతుంది. ఒక్కొక్క లేయర్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ ఏమౌతుందనే క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. ఇది న్యూ ఏజ్ థ్రిల్లర్.
మీ స్వాతిముత్యం సినిమాకి థియేటర్స్ లో అనుకున్నంతగా అందుకో లేదనిపించింది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు వున్నాయి.?
స్వాతిముత్యం రిలీజ్ చేసినప్పుడు చిరంజీవి గారు, నాగార్జున గారి సినిమాలతో కలసి రావడం వలన బ్యాడ్ రిలీజ్ డేట్ అనే మాట వినిపించింది. ఉన్నవాట్లో మనదొక్కటే ఫ్యామిలీ సినిమా పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుదనే నమకంతో నిర్మాతలు ఆ డేట్ కి విడుదల చేశారు. అది ఇంకా బాగా ఆడాల్సింది. ఐతే ఓటీటీలో దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా చాలా మంచి సినిమా చేశారని ప్రశంసిస్తున్నారు . ఈ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తాను. ఇప్పుడు నేను స్టూడెంట్ సర్' పై మాకు పూర్తి నమ్మకంగా వుంది. మంచి రిలీజ్ డేట్ తో వస్తున్నాను. మంచి సినిమాని ప్రేక్షకులు గొప్పగా ఆదరిస్తారనే నమ్మకం వుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ?
నెక్స్ట్ ఒక క్రైమ్ కామెడీ చేయబోతున్నా. ఈ రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా వుంటుంది.