శుక్రవారం, 29 సెప్టెంబరు 2023
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 30 మే 2023 (18:25 IST)

సమంత, నయనతార అంటే ఇష్టం : అవంతిక దస్సాని

Avantika Dassani
Avantika Dassani
ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ కూతురు అవంతిక దస్సాని నేను స్టూడెంట్ సర్' లో హీరోయిన్ గా నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందిన ఈ సినిమాలో హీరో బెల్లంకొండ గణేష్. ‘నాంది’ సతీష్ వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 2న నేను స్టూడెంట్ సర్ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో  హీరోయిన్ అవంతిక దస్సాని చెప్పిన విషయాలు. 
 
నేను స్టూడెంట్ సర్' తో పరిచయం కావడం ఎలా అనిపిస్తోంది ?
మిథ్యా తో ఓటీటీకి పరిచయమయ్యాను. అలాగే నా హిందీ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది . ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్'తో తెలుగులో పరిచయం కావడం చాలా ఎక్సయిటెడ్ గా వుంది.
నేను స్టూడెంట్ సర్' ప్రాజెక్ట్ లోకి ఎలా వచ్చారు ?
శ్రీనివాస్ గారు, సురేష్ గారి హిందీ ‘ఛత్రపతి’తో  అమ్మ వర్క్ చేశారు. అలా ఈ కథ వినడం జరిగింది. చాలా నచ్చింది. ఇందులోని మలుపులు చాలా ఎక్సయిట్ చేశాయి.
 
ఈ రోజుల్లో హీరోయిన్స్  గ్లామర్ సినిమాల వైపు చూస్తున్నారు.. మీరు మాత్రం కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాల వైపు మొగ్గు చూపడానికి కారణం ?
ఇప్పుడు ఇండస్ట్రీ కంటెంట్ బేస్డ్ సినిమాల వైపు చూస్తోంది. నేను  కూడా కథలో కీలకంగా ఉండే పాత్రలని చేయడానికె ఇష్టపడతాను.  అలాంటి కథలే ఎక్సయిట్ చేస్తాయి.
 
తెలుగులో తొలి సినిమా చేసే విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. ?  
సౌత్ ఇండస్ట్రీ అమ్మకు చాలా ఇష్టం, గౌరవం. ఆమెను ప్రేక్షకులు ఎంతోగానో అభిమానించారు. ఇక్కడ పరిశ్రమలో అమ్మకు మంచి అవగాహన వుంది. హిందీ ఛత్రపతిలో అమ్మ పని చేశారు. అలా ఈ ప్రాజెక్ట్ గురించి సంప్రదించినప్పుడు.. తెలుగులో లాంచ్ కావడానికి, యంగ్ టీమ్ తో కలసి పని చేయడానికి మంచి అవకాశమనిపించింది. కథల ఎంపికలో అమ్మ ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వరు. కానీ అమ్మ సలహాలు తీసుకుంటాను. నాకు ఏం కావాలో, నాకు ఏది బావుంటుందో  తనకి తెలుసు.
 
తెలుగు సినిమాలు చూస్తుంటారా ?
చూస్తాను. పుష్ప, అల వైకుంఠపురములో చిత్రాలలో  అల్లు అర్జున్ గారు చాలా గొప్పగా చేశారు.   సమంత, నయనతార అంటే ఇష్టం.
 
నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ?
మిథ్యా సీజన్ 2 వస్తోంది. యు షేప్ కి గల్లీ షూటింగ్ పూర్తయింది.