గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (16:08 IST)

పుష్ప-2 తర్వాత.. నాలుగోసారి ఆ దర్శకుడితో బన్నీ!?

Pushpa: The Rise
పుష్పతో బాక్సాఫీస్‌ దగ్గర రికార్డులు సృష్టించిన అల్లు అర్జున్ పుష్ప-2తో కలెక్షన్ల వర్షం కురిపించేందుకు సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం బన్నీ "పుష్ప-2"తో బిజీగా ఉన్నాడు. సుకుమార్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటుంది. 
 
ఈ సినిమా తర్వాత బన్నీ నెక్స్ట్‌ మూవీకి సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది. పుష్ప-2’ తర్వాత బన్నీ మళ్లీ త్రివిక్రమ్‌తో చేతులు కలపబోతున్నట్లు తెలుస్తుంది. 
 
ఈ సినిమాను సొంత బ్యానర్ గీతా ఆర్ట్స్ సంస్థపై అల్లు అరవింద్ నిర్మించనుండటం విశేషం. జులాయ్, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో సినిమాలు హిట్ అయిన నేపథ్యంలో నాలుగోసారి త్రివిక్రమ్‌లో అల్లు అర్జున్ చేతులు కలుపుతున్నారు.