సంబంధిత వార్తలు
- 'పుష్ప' నిర్మాత - డైరెక్టర్ కార్యాలయాల్లో ఐటీ సోదాలు
- హంట్ ఫర్ పుష్ప కాన్సెప్ట్ ఇండియా లో రూల్ చేసింది
- ప్రేక్షకుడికి ఆనందం, ఆలోచన కలిగించే కథలే తీస్తా : దర్శకుడు రామ్ రెడ్డి పన్నాల
- హ్యాపీ యానివర్సరీ క్యూటీ అంటూ స్నేహకు శుభాకాంక్షలు తెలిపిన అల్లు అర్జున్
- 20 కోట్ల గ్రాస్ సాధించిన నిఖిల్, అనుపమల 18 పేజెస్
ఫాద్‌ఫాజిల్‌తో పుష్ప-2 కీలక షెడ్యూల్ పూర్తి
sukumar, Fadfazil
అయితే తాజాగా పుష్ప-2 గురించి మరో లేటెస్ట్ అప్‌డేట్‌ను విడుదల చేసింది చిత్రబృందం.పుష్ప చిత్రంలో మలయాళ అగ్ర నటుడు ఫహద్ ఫాజిల్ పోషించిన పోలీసాఫీసర్ భన్వర్‌సింగ్ షెకావత్ పాత్ర అందరిని ఎంతగానో అలరించింది.పార్టీ లేదా పుష్ప అంటూ ఆయన చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయిన సంగంతి తెలిసిందే. పుష్ప-2లో కూడా ఫహద్ ఫాజిల్ పాత్ర కీలకంగా ఉండబోతున్న సంగతి విదితమే. గత కొన్ని రోజులుగా మారేడుమిల్లి అటవి ప్రాంతంలో ఫహద్ ఫాజిల్‌పై సుకుమార్ దర్శకత్వంలో ్ల ముఖ్య ఘట్టాలను తెరకెక్కించారు. ఇటీవలే ఆ షెడ్యూల్ పూర్తయింది. దీనికి సంబంధించిన ఓ స్టిల్‌ను విడుదల చేసింది చిత్రబృందం.ఫహద్‌ఫాజిల్‌తో దర్శకుడు సుకుమార్ కనిపిస్తున్న ఈ స్టిల్ ఇప్పుడు వైరల్‌గా మారింది.
ఫహద్ ఫాజిల్‌కు సంబంధించిన సన్నివేశాల్ని తాజా షెడ్యూల్‌లో పూర్తి చేశామని చిత్రబృందం తెలియజేసింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు సుకుమార్, ఫహద్ ఫాజిల్ సెట్‌లో ఉన్నప్పటి వర్కింగ్ స్టిల్‌ను విడుదల చేసింది. దీనికి భన్వర్‌సింగ్ షెకావత్ అలియాస్ ఫహద్ ఫాజిల్‌కు తాలూకు ముఖ్య సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. ఈ సారి ఆయన ప్రతీకారం తీర్చుకోవడానికి రాబోతున్నాడు అంటూ క్యాప్షన్‌ను జత చేశారు. రష్మిక మందన్న, ఫహద్ ఫాజిల్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతాన్నందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ అసోసియేషన్ విత్ సుకుమార్‌రైటింగ్స్ కలయికలో ఈ చిత్రం నిర్మాణం జరుపుకుంటోంది. పాన్ వరల్డ్ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తారు.
తర్వాతి కథనం
